నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని టేకులపల్లి గ్రామచెరువు నుంచి ఒండ్రు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్థులు, రైతులు ఆరోపించారు. ఈ మట్టిని టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇటుక బట్టీలకు తీసుకువెళ్తున్నారని మక్తల్ ఇరిగేషన్ కార్యాలయం వద్ద భాజపా ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.
ఇటుక బట్టీలకు ఒండ్రు మట్టి.. రైతుల ఆందోళన - Alluvial clay for brick kilns
పొలాలకు తరలించాల్సిన ఒండ్రు మట్టిని ఇటుక బట్టీలకు తీసుకెళ్తున్న సంఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని టేకులపల్లిలో చోటుచేసుకుంది. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ భాజపా ఆధ్వర్యంలో గ్రామ రైతులు, ప్రజలు ఆందోళనకు దిగారు.
ఒండ్రు మట్టి, రైతుల ఆందోళన
వ్యవసాయ పొలాలకు తరలించాల్సిన ఒండ్రు మట్టిని కొందరు వ్యక్తులు.. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో ఇటుక బట్టీలకు తీసుకెళ్లి సొమ్ము చేసుకుంటున్నారని భాజపా నేత కొండయ్య ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై రైతులు, భాజపా నేతలు ఇరిగేషన్ ఈఈ సంజీవ్ కుమార్కు వినతి పత్రం సమర్పించారు.
- ఇదీ చదవండి :నామినేషన్ వేసిన జానారెడ్డి, నోముల భగత్