తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడు

ఇద్దరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరిమీద ఒకరు నమ్మకంతో శారీరకంగా కూడా దగ్గరయ్యారు. పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి అబ్బాయిలో మార్పు వచ్చింది. వివాహమాడేది లేదని మొహం చాటేస్తున్నాడు. మోసపోయానని గ్రహించిన యువతి పెద్దలతో మాట్లాడించినా... పంచాయితీలు చేసినా... కేసులు పెట్టినా లాభం లేకపోయింది.

బ్యాంకు ముందు యువతి ధర్నా

By

Published : May 22, 2019, 10:41 AM IST

నల్గొండ జిల్లా చండూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్​గా పని చేస్తున్న శ్రీకాంత్... సూర్యాపేటకు చెందిన ఉమారాణి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి యువకుడు యువతిని శారీరకంగా వాడుకున్నాడు. పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ఇష్టం లేదంటూ చెపుతున్నాడు. సూర్యాపేట జిల్లా పోలీస్ ఎస్పీని కలిసినా సమస్య పరిష్కారం కాలేదని ఉమా వాపోయింది. అతనికున్న రాజకీయ పలుకుబడితో కేసును పక్కదారి పట్టించి పోలీసులపై ఒత్తిడి తెస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీలు పెట్టినా కూడా ఫలితం దక్కలేదని... చివరికి శ్రీకాంత్ విధులు నిర్వహిస్తున్న ఎస్బీహెచ్ బ్యాంక్ ముందు ఆందోళనకు దిగింది. యువకుడితో వివాహం జరిగే వరకు పోరాడుతానని పేర్కొంది.

బ్యాంకు ముందు యువతి ధర్నా

ABOUT THE AUTHOR

...view details