Yadadri Power Plant TOR Issue :నల్గొండ జిల్లా దామరచర్ల వద్ద తెలంగాణ జెన్ కో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ ప్లాంటుకు తొలుత 2017 జూన్ 29న పర్యావరణ అనుమతి జారీ అయింది. అదే ఏడాది అక్టోబరు 17న రూ.29 వేల కోట్ల అంచనా వ్యయంతో జెన్ కో నిర్మాణం ప్రారంభించి.. భెల్(Bharat Heavy Electricals Limited)కు కాంట్రాక్టు అప్పగించింది. కరోనా మహమ్మారి, ఇతర కారణాల వల్ల జాప్యం జరిగి.. అంచనా వ్యయం రూ.34 వేల కోట్లకు ఎగబాకింది.
Uncertainty to Issue TOR for Yadadri Plant :మరోవైపు, యాదాద్రి ప్లాంటుకు పర్యావరణ అనుమతి ఇవ్వడం తగదంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ)లో వైజాగ్‌కు చెందిన సమత, ముంబయికి చెందిన కన్సర్వేషన్ యాక్షన్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థలు కేసు వేశాయి. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ యాదాద్రి ప్లాంటు నిర్మాణం వల్ల ఆ ప్రాంతంలో పర్యావరణంపై పడే ప్రభావంపై అధ్యయనం కోసం వెంటనే టీఓఆర్ జారీ చేయాలని.. కేంద్ర పర్యావరణ శాఖను గత అక్టోబరులో ఆదేశించింది.
ఇప్పటివరకు టీఓఆర్ జారీ చేయలేదు. దీనిపై కేంద్రానికి జెన్ కో ఇప్పటికే ఐదుసార్లు లేఖలు రాసినా స్పందన శూన్యం. గత మే నెల 11న కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి లీనా నందన్‌కు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ రాసిన లేఖలో యాదాద్రి విద్యుత్ కేంద్రానికి టీఓఆర్ జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. యాదాద్రి థర్మల్ ప్లాంటుపై రూ.20 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారని.. జాప్యం జరిగితే విద్యుదుత్పత్తి ఆలస్యమవుతుందని పేర్కొన్నారు.
Yadadri thermal power plant: యాదాద్రి వెలిగేదెప్పుడో.. నత్తనడకన థర్మల్ విద్యుత్ కేంద్రం పనులు