యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశం ఇవాళ జరిగింది. డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లోనూ జెండా ఎగురవేసేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. యాదగిరిగుట్ట పురపాలిక కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
యాదాద్రి పురపాలికను కైవసం చేసుకుంటాం: డీసీసీ అధ్యక్షుడు - congress meeting
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.
యాదాద్రి పురపాలికను కైవసం చేసుకుంటాం: డీసీసీ అధ్యక్షుడు