Sarpanch Protest: గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన నిధులు విడుదల చేయాలని మరో సర్పంచ్ ఆందోళన బాట పట్టారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలంలో కుంకుడుచెట్టు తండా సర్పంచ్ ప్రియాంక కుటుంబసభ్యులు సాగర్- నల్గొండ రహదారికి అడ్డంగా పడుకుని నిరసన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన నిధులు ఎంబీలు చేసిన తరువాత ఏడెనిమిది నెలలు గడుస్తున్నా.. సంతకాలు పెట్టకుండా ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
Sarpanch Protest: "ఊరు అభివృద్ధి కోసం అప్పులపాలయ్యా.." మహిళా సర్పంచ్ ఆవేదన..
Sarpanch Protest: అభివృద్ధి కోసం అప్పులు చేసిన సర్పంచుల ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలంలో కుంకుడుచెట్టు తండా సర్పంచ్ నిరసన బాట పట్టారు. సుమారు పది లక్షల వరకు ఖర్చు పెట్టినా.. నిధులు మంజూరు కావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
అదేమని అడిగితే ఎమ్మెల్యే సహకారంతో ఇబ్బంది పెడుతున్నారని ప్రియాంక ఆరోపించారు. మానసికంగా ఇబ్బంది పెడుతున్నారన్నారు. గ్రామ అభివృద్ధి కోసం దాదాపు రూ.10 లక్షల వరకు అప్పు తెచ్చి ఖర్చు పెట్టానన్నారు. సర్పంచ్ ప్రియాంకతో పాటు ఆమె కుటుంబ సభ్యులు గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచి తెరాస పార్టీలో చేరారు. అధికార పార్టీ నేతలే తమకు నిధులు రాకుండా ఉపసర్పంచ్ని సంతకం చేయకుండా మానసికంగా వేదనకు గురి చేస్తున్నారని సర్పంచ్ ప్రియాంక కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వెంటనే నిధులు విడుదల చేసి.. అప్పులపాలైన తమ కుటుంబాన్ని కాపాడాలంటూ డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: