రాత్రికి రాత్రే నీళ్ల ట్యాంక్ కూల్చివేశారు .. - నీళ్ల ట్యాంక్
నలభై సంత్సరాల నుంచి ఉన్న నీళ్ల ట్యాంక్ రాత్రికి రాత్రే కూల్చివేసిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది.
రాత్రికి రాత్రే నీళ్ల ట్యాంక్ కూల్చివేశారు ..
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఇస్లాంపురంలో వాటర్ ట్యాంక్‌ను గురువారం రాత్రి కూల్చివేయడం వల్ల వివాదం చెలరేగింది. ఉదయం గుర్తించిన స్థానికులు పురపాల కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తమ స్థలంలో ఉందంటూ ట్యాంక్ పక్కన నివాసం ఉంటున్నవారే కూల్చేశారని ఆరోపించారు. రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటామని పురపాలక ఇంఛార్జి కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.
- ఇదీ చూడండి : హరితహారం మొక్క తిన్న మేక.. రూ 500 జరిమానా