నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం పెద్దగట్టులో యూసీఐఎల్ అధికారులను గిరిజన నేతలతో కలిసి గ్రామస్థులు అడ్డుకున్నారు. యురేనియం నిక్షేపాల అన్వేషణలో భాగంగా నీటి నమూనాల కోసం అధికారుల బృందం మంగళవారం గ్రామానికి వచ్చింది. అంతకుముందు గ్రామంలో మానవహక్కుల సంఘం, విద్యావంతుల వేదిక, సీపీఎం, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ర్యాలీ, అవగాహన సదస్సు నిర్వహించారు. అడవులు, పచ్చని పల్లెలు ఎడారులుగా మారే ప్రమాదం ఉన్నందున తవ్వకాలు జరగనీయమని గ్రామస్థులు తేల్చిచెప్పారు.
'యురేనియం తవ్వకాలు అడ్డుకొని అడవులు కాపాడుకుంటాం' - nalgonda
యూరేనియం నిక్షేపాల అన్వేషణలో భాగంగా గ్రామానికి వచ్చిన యూసీఐఎల్ అధికారుల బృందాన్ని నల్గొండ జిల్లా పెద్దగట్టు గ్రామస్థులు అడ్డుకున్నారు.
'యురేనియం తవ్వకాలు అడ్డుకొని అడవులు కాపాడుకుంటాం'