తెలంగాణ

telangana

ETV Bharat / state

కిష్టారాయిన్​పల్లి జలాశయ పనులను అడ్డుకున్న బాధితులు

నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని లక్ష్మణపురం గ్రామ పునరావాస బాధితులు కిష్టారాయిన్​పల్లి జలాశయ పనులను అడ్డుకున్నారు. తమకు పూర్తి న్యాయం చేశాకే పనులు కొనసాగించాలని భీష్మించారు.

కిష్టారాయిన్​పల్లి జలాశయ పనులను అడ్డుకున్న బాధితులు
కిష్టారాయిన్​పల్లి జలాశయ పనులను అడ్డుకున్న బాధితులు

By

Published : Aug 4, 2020, 4:13 PM IST

నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని లక్ష్మణపురం గ్రామ పునరావాస బాధితులు డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన కిష్టారాయిన్​పల్లి జలాశయ పనులను అడ్డుకున్నారు. లక్షణాపురం గ్రామం ఈ ప్రాజెక్టులో భాగంగా పూర్తిగా ముంపునకు గురవుతోంది. తమను అదుకుని పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ పనులను బహిష్కరించారు. ప్రాజెక్టు శంకుస్థాపన రోజు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చిన తర్వాతే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details