రోడ్డుపై కంప వేసి ఉపాధి హామీ కూలీల ఆందోళన - employment guarantee workers protest
రోడ్డుపై కంప వేసి ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపట్టిన ఘటన నల్గొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడంలో చోటుచేసుకుంది.
నల్గొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడంలో ఉపాధి కూలీలు గ్రామ పంచాయతీ వద్ద రోడ్డుపై కంప వేసి ఆందోళన చేపట్టారు. ఉపాధి హామీ పనుల విషయంలో పంచాయతీ కార్యదర్శి వెనుకబడిన కులాల వారి పట్ల వివక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొన్ని వారాలే పని కలిపిస్తూ... తక్కువ డబ్బులు వచ్చే విధంగా చూస్తున్నట్టు కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనుల విషయమై గ్రామంలో వెనుకబడిన వారికి పనులు కల్పించాలని ఆందోళనకు దిగారు. మండల ఉపాధి హామీ అధికారులు.. ఘటనాస్థలికి చేరుకుని సమస్యలు పరిష్కారిస్తామని హామీ ఇవ్వగా... ఆందోళన విరమించారు.