తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేంద్రంలో కాంగ్రెస్​దే హావా.. రాహుల్​ గాంధీనే ప్రధాని' - devarakonda

నల్గొండ లోక్​సభ కాంగ్రెస్​ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజక వర్గంలోని దేవరకొండలో రోడ్​షో నిర్వహించారు.

దేవరకొండలో ఉత్తమ్ రోడ్​ షో

By

Published : Apr 8, 2019, 6:10 AM IST

పోలింగ్​తేదీ సమీపించే కొద్ది అభ్యర్థులు ప్రచార వేగం పెంచారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. కేంద్రంలో కాంగ్రెస్​ పార్టీనే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. రాహుల్​ గాంధీ ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు. తనని గెలిపిస్తే గిరిజనుల తరఫున పోరాడి రిజర్వేషన్​లను 6 నుంచి 10 శాతానికి పెంచేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

తెరాస సగం స్థానాల్లో కూడా గెలవదు

ఎంపీపీగా ఓడిపోయిన తెరాస అభ్యర్థి నర్సింహారెడ్డి ఎంపీగా ఎలా గెలుస్తారని ఎద్దేవా చేశారు. తెరాస పార్టీ కనీసం 8స్థానాల్లో కూడా గెలవదన్నారు. హస్తం గుర్తుపై ఓటేసి తనని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.​ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ బాలు నాయక్, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

దేవరకొండలో ఉత్తమ్ రోడ్​ షో

ఇదీ చదవండి: మహిళల నృత్యాలతో హోరెత్తిన కోమటిరెడ్డి ప్రచారం

ABOUT THE AUTHOR

...view details