సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలపై నిపుణులతో చర్చించాక... పార్టీ పరంగా కమిటీ వేసి పోరాటానికి దిగుతామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం, శాసనసభ భవనాల నిర్మాణాలపై పీసీసీ కార్యవర్గం నిరసన వ్యక్తం చేయాలని తీర్మానించిందని ఉత్తమ్ తెలిపారు. పార్టీ బలోపేతంపై వచ్చే నెల తొలి నాలుగు రోజుల్లో డీసీసీలతో విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
'సాగునీటి ప్రాజెక్టు నిర్మాణాలపై త్వరలో పోరాటం' - undefined
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణాలపై పార్టీ పరంగా చర్చించి పోరాటానికి దిగుతామన్నారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి . రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై వచ్చే నెలలో డీసీసీలతో విస్తృత స్థాయి సమావేశాలుంటాయని ఆయన తెలిపారు.
'సాగునీటి ప్రాజెక్టు నిర్మాణాలపై త్వరలో పోరాటం'
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని... నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లోని విజయ్ విహార్లో నిర్వహించారు. పురపాలక ఎన్నికలకు సంబంధించి... జులై 5 నుంచి 10 వరకు సమావేశాలు జరపాలని కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా సహా ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులతోపాటు... జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి తదితర నేతలు సమావేశంలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ' సుమారు 3నెలల్లో పూర్తి స్థాయి ఫీజులు ఖరారుచేస్తాం'
TAGGED:
uttam