నిరుద్యోగులను తెరాస సర్కారు మోసం చేసిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో భాజపా అభ్యర్థి రవి కుమార్ తరఫున ప్రచారం నిర్వహించారు. అనుముల మండలం పులిమామిడి, మారేపల్లి, అన్నారంలో రోడ్ షో చేశారు. కాంగ్రెస్, తెరాసలు సాగర్‌కు చేసిందేమి లేదని విమర్శించారు.
'తెరాస సర్కారు నిరుద్యోగులను మోసం చేసింది' - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా భాజపా అభ్యర్థిని గెలిపించాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. తెరాస సర్కారు నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. భాజపాను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
'తెరాస సర్కారు నిరుద్యోగులను మోసం చేసింది'
నిరుద్యోగ యువతకు కేసీఆర్ అన్యాయం చేశారని కిషన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం అప్పులు చేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. భాజపాను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి:కరోనాపై ఇది రెండో పెద్ద యుద్ధం: మోదీ