14 మంది ఎంపీలతో ఏం సాధించారో చెప్పండి: ఉత్తమ్
ఇప్పుడున్న 14 మంది ఎంపీలతో తెరాస రాష్ట్రానికి ఏం సాధించిందో కేసీఆర్ చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. నల్గొండ జిల్లా త్రిపురారంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు
11 మంది ఎంపీలతో పాటు ఇతర పార్టీలకు చెందిన ముగ్గురు ఎంపీలను చేర్చుకుని తెరాస ఏం చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. 14 మంది లోక్సభ సభ్యులున్నా విభజన హామీలు సాధించడంలో గులాబీ పార్టీ విఫలమైందని ఆరోపించారు. గిరిజన విశ్వవిద్యాలయం, ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకురాలేదని విమర్శించారు. ఈ కార్యక్రమానికి జానారెడ్డి, ఇతర నాయకులు హాజరయ్యారు.
ఇవీ చూడండి:హస్తంను వీడి... కారెక్కుతున్న సునీతా..!