తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగర్ టు శ్రీశైలం..లాంచీలో ప్రయాణం..

కృష్ణమ్మ పరవళ్లు, నల్లమల అటవీ అందాలను చూస్తూ.. ఆహ్లాదకరంగా సాగే ప్రయాణం కోసం ఎదురుచూస్తున్న పర్యాటకులకు తెలంగాణ టూరిజం అధికారులు లాంచీ ప్రయాణాన్ని ఏర్పాటు చేశారు.

లాంచీలో ప్రయాణం..

By

Published : Sep 7, 2019, 5:31 PM IST

నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాన్ని స్థానిక ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య జెండా ఊపి ప్రాంభించారు. ఈరోజు 40 మంది ప్రయాణికులతో సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ బయల్దేరింది. ప్రతి బుధవారం, శనివారం లాంచీని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ టూరిజం అధికారులు స్పష్టం చేశారు. లాంచీలో వెళ్లి రావడానికి పెద్దలకు రూ.2200, పిల్లలకు రూ.1760 టికెట్ ధరలు నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులను కూడా పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. వాటికి ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. పర్యాటకులకు భోజనం, వసతి సదుపాయాలు కూడా పర్యాటక శాఖ వారే ఏర్పాటు చేయనున్నారు.

లాంచీలో ప్రయాణం..

ABOUT THE AUTHOR

...view details