విద్యార్థులు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించవచ్చని ప్రముఖ సైకాలజిస్ట్ పోలె సైదులు పేర్కొన్నారు. పాఠ్యాంశాలపై ముందు నుంచే అవగాహన పెంచుకొని సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలని సూచించారు. జైహింద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో 'కెరీర్ గైడెన్స్' అంశంపై శిక్షణ ఇచ్చారు.
విద్యతో పాటు వ్యక్తిత్వ వికాస విలువలు విద్యార్థులు పెంపొందించుకోవాలని.. తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలని సైదులు అన్నారు. తాత్కాలిక ఆకర్షణలకు లోనుకాకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సన్మార్గంలో ప్రయాణించాలని సూచించారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటి ప్రతిజ్ఞ చేయించారు.