నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలో పలు దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మొత్తం 650 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను పట్టుకోగా.. వాటిని సమీప పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీటితో పాటు మునుగోడు మండలంలోని ఓ దుకాణంలో 350 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను పోలీసులు స్వాధీనపరచుకుని దుకాణాలను సీజ్ చేశారు.
జిల్లావ్యాప్తంగా 1,000 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్ల పట్టివేత
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలో పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టగా 650 నకిలీ విత్తనాల ప్యాకెట్లను అధికారులు పట్టుకున్నారు. మునుగోడు మండలపరిధిలోని ఓ షాపులో 350 నకిలీ విత్తనాల ప్యాకెట్లను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
fake-seed
జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి నకిలీ పత్తి విత్తనాలు... ఏదో ఒక చోట పట్టుబడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసులు వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.
Last Updated : Jul 16, 2020, 12:04 PM IST