తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగునీరిస్తేనే ఓట్లేస్తాం: సుంకిశాల తండావాసులు - నల్గొండ జిల్లా తాజా వార్తలు

సాగు నీరు ఇస్తేనే ఓట్లు వేస్తామని చెబుతున్నారు నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం సుంకిశాల తండావాసులు. సాగు నీరు ఇవ్వకుంటే నాగార్జునసాగర్​ ఉపఎన్నికను బహిష్కరిస్తామని హెచ్చరించారు.

Sunkashilatanda villagers warn of boycott of Nagarjunasagar by-election
సాగునీరిస్తేనే ఓట్లేస్తాం: సుంకిశాల తండావాసులు

By

Published : Jan 20, 2021, 11:34 AM IST

Updated : Jan 20, 2021, 12:13 PM IST

నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం సుంకిశాల తండావాసులు నాగార్జునసాగర్ ఉప ఎన్నికను బహిష్కరింస్తామని హెచ్చరించారు. నాగార్జునసాగర్​లో ముంపునకు గురైన సుంకిశాలతండా ప్రజల భూములకు గత 60 సంవత్సరాల నుంచి సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని గ్రామ సర్పంచ్​ తెలిపారు.

ఉన్న భూములకు పట్టాలు లేక.. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నోముల నర్సింహయ్య సుంకిశాల తండాకు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పడు.. తండాకు నీరు లిఫ్ట్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఆ లిఫ్ట్ విషయం ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకపోతే ఉపఎన్నిక బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:కొనసాగుతున్న ఉత్కంఠ... మేయరా.. ప్రత్యేక కమిషనరా?

Last Updated : Jan 20, 2021, 12:13 PM IST

ABOUT THE AUTHOR

...view details