వేసవిలో ఉచిత శిక్షణ... ఆనందంలో పిల్లలు - camp
నల్గొండ జిల్లా కేంద్రంలోని బాలకేంద్రంలో వేసవికాల క్యాంపు ఉచితంగా నిర్వహించారు. ఇందులో తైక్వాండో, డ్యాన్స్, డ్రాయింగ్, కూచిపూడి, మొదలైన అంశాల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చారు.
నేర్చుకుంటున్న పిల్లలు
వేసవి కాలంలో సమయాన్ని వృథా చేయకుండా నల్గొండ జిల్లా కేంద్రంలోని బాలకేంద్రంలో ఉచితంగా సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఇందులో తైక్వాండో, డ్యాన్స్, డ్రాయింగ్, కూచిపూడి, మొదలైన వాటికి ఉచితంగా శిక్షణ ఇచ్చారు. ఈ క్యాంపు ఈ నెల 06 నుండి 30 వరకు జరుగుతుందని క్యాంపు అధ్యక్షుడు బాలు తెలిపారు. ఇక్కడ పిల్లలకు ఉచితంగా శిక్షణ ఇవ్వటం చాలా బాగుందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.