నల్గొండ జిల్లా మునుగోడులోని బీసీ వసతి గృహాన్ని ప్రభుత్వం తొలగించినందుకు నిరసనగా విద్యార్థి సంఘాలు రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థుల ఆందోళనకు సర్పంచ్, పాలక వర్గం మద్దతు పలికారు. తొలగించిన వసతి గృహాన్ని కొనసాగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తారోకో వల్ల రహదారిపై భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోవటంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.
వసతి గృహాన్ని కొనసాగించాలని విద్యార్థుల ధర్నా - REMOVE
మునుగోడులో ఉన్న బీసీ వసతి గృహాన్ని కొనసాగించాలంటూ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థుల ఆందోళనకు స్థానిక నాయకులు కూడా మద్దతు తెలిపారు.
STUDENTS DONE PROTEST AGAINST REMOVE THE HOSTEL