Special Story On Nalgonda Shaik Sayyed PhD : ప్రపంచంలో చదువొక్కటే మన స్థాయిని పెంచగలదు. లక్ష్య ఛేదన చేయాలనే బలమైన సంకల్పం ఉంటే మనిషిని ఆపగలిగేది ఈ ప్రపంచంలోనే లేదు. ఇలాంటి వాక్యాలనేస్ఫూర్తిగా తీసుకుని ఆ యువకుడి ప్రస్థానం ప్రారంభమైంది. ఫలితంగా అతడు పేదరికాన్ని జయించాడు. డాక్టరేట్ సాధించి ఊరుకు, కుటుంబానికి గర్వకారణంగా నిలిచాడు.
Nalgonda Young Man Came From Poverty Got PhD :ఈ యువకుడి పేరు షేక్ సయ్యద్ మియా. నల్గొండ జిల్లా చండూరు మండలం కస్తాల ఇతని స్వస్థలం. తల్లిదండ్రులు షేక్ హుస్సేన్, మదార్ బీ. వారిది పేద కుటుంబం. ఇతనికి మాత్రం చదువంటే పంచ ప్రాణాలు. ఆ క్రమంలో పదో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి మరణం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. చదువు ఆపేద్దామనుకున్నాడు సయ్యద్. కానీ గురువుల ప్రోత్సాహంతో 10వ తరగతి పూర్తి చేశాడు.
తండ్రి చనిపోయిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డా :తర్వాత ఇంటర్ నల్గొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి జిల్లా ప్రథమ ర్యాంకు సాధించడంతో జాతీయ ఫెల్లోషిప్ స్కాలర్‌షిప్(National Fellowship Scholarship)కు ఎంపికయ్యాడు. తర్వాత డిగ్రీ.. రాంరెడ్డి అనే లెక్చరర్ ఆర్థికసాయంతో పూర్తి చేశాడు సయ్యద్. పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిచేసి.. అందులోనూ మొదటి ర్యాంకర్‌గా నిలిచాడు. అక్కడ డాక్టర్ జీ అంజయ్య తనను ఇంటి మనిషిలా చూసి, ఈ స్థాయిలో ఉండడానికి కారణం అంటున్నాడు సయ్యద్. తండ్రి చనిపోయిన తర్వాత తన పేదరికం గురించి, అతడు ఎదుర్కొన్న ఇబ్బందులుగురించి చెబుతున్నాడు. చదువు సాగిన విధానం, తన పేదరికం గురించి చెబుతూ ఇవేవీ తనకు అడ్డుకాలేదని చెబుతున్నాడు. మనిషికి ఆపద సమయాల్లో ధైర్యంగా ముందుకెళ్లాలని తన జీవితాన్నే ఉదహరిస్తున్నాడు సయ్యద్ మియా.
"నా చదువుకు స్నేహితులు బాగా సహయం చేశారు. ఆ తర్వాత రాంరెడ్డి మాస్టారు.. మా గ్రామ ప్రజలందరీ సేవ అసలు మర్చిపోను. నాకు ప్రతిక్షణం అండదండగా నిలిచింది గ్రామ ప్రజలు.. నా స్నేహితులే. నేను ఏ కష్టాల్లో ఉన్న నన్ను ముందుండి నడిపించి మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. నా రీసెర్చ్‌కి ఎంతగానో వారు సహాయపడ్డారు. నాకు ప్రోత్సహించిన వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఉపాధ్యాయ వృతిలో స్థిరపడదామని అనుకుంటున్నాను." -డాక్టర్ షేక్ సయ్యద్ మియా, కస్తాల
Portraits with Millets : చిరుధాన్యాలతో జీవం ఉట్టిపడే అందమైన చిత్రాలు
ఓయూ నుంచి చరిత్ర విభాగంలో పీహెచ్‌డీ :ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) నుంచి చరిత్ర విభాగంలో పీహెచ్‌డీ పొందాడు. ట్రేడ్ అండ్ కామర్స్ ఇన్ ఆంధ్రదేశ 1163 ఏడీ -1687ఏడీ అంశంపై పరిశోధన పూర్తి చేశాడు. అయితే ఈ క్రమంలో కష్టాలు భరించలేక చదువే మానేద్దామనుకునే పరిస్థితి వచ్చిందన్నాడు. ఆ సమయాల్లో తనకు మిత్రులే అండగా నిలిచారని చెబుతున్నాడు.