నాగార్జునసాగర్ ఉపఎన్నికకు కాంగ్రెస్... తమ అభ్యర్థిని ప్రకటించింది. ఉపఎన్నిక షెడ్యూల్ ఖరారైన వెంటనే జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఖరారు చేశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎప్పుడూ వెనకుండే కాంగ్రెస్... సాగర్ ఉపఎన్నికకు ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది. షెడ్యూల్ ఖరారైన వెంటనే జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించి... ఇతర పార్టీల కంటే ఒక అడుగు ముందే ఉన్నామన్న సంకేతం ఇచ్చింది.
నాగర్జునసాగర్ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు
22:06 March 16
అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సోనియాగాంధీ
నాగార్జునసాగర్‌లో గెలిచేందుకు కొన్ని రోజులుగా జానారెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్‌కు పట్టున్న నియోజకవర్గం కావడం... ఇతర పార్టీలకు బలమైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడం... జానారెడ్డి గెలుపునకు దోహదం చేస్తాయని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తెరాస సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో నాగార్జునసాగర్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. పార్టీ అభ్యర్థిపై తెరాస అధిష్ఠానం ముమ్మర కసరత్తు చేస్తుండగా... భాజపా ఆచితూచి వ్యవహరిస్తోంది. వామపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలిపే విషయమై చర్చలు జరుపుతున్నాయి.
ఇదీ చూడండి:నాగార్జునసాగర్ ఉపఎన్నికకు మోగిన నగారా...