తెలంగాణ

telangana

ETV Bharat / state

శివాలయం గర్భగుడిలోకి సాగర్ నీరు

సాగర్ క్రస్ట్ గేట్ల నుంచి విడుదల చేసిన నీరు ప్రాజెక్టు దిగువన ఉన్న శివాలయం గర్భగుడిలోకి చేరింది. పోలీసులు శివాలయం పరిసరాల్లోకి పర్యటకులను అనుమతించడం లేదు.

గర్భగుడిలోకి సాగర్ నీరు

By

Published : Aug 15, 2019, 11:09 PM IST

Updated : Aug 16, 2019, 6:44 AM IST

నాగార్జునసాగర్ జలాశయం దిగువనున్న శివాలయం గర్భగుడిలోకి వరద నీరు చేరింది. ఈరోజు దాదాపు 7 లక్షల 50 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడం వల్ల క్రస్ట్ గేట్ల దిగువన ఉన్న ఆలయం వరదతో నిండిపోయింది. ఈనెల 12న సాగర్ క్రస్ట్ గేట్లు తెరవడం వల్ల పుష్కర ఘాట్ల వద్ద స్నానానికి వెళ్లిన జహీరాబాద్​కు చెందిన వ్యక్తి కొట్టుకుపోవడం వల్ల ఆరోజు నుంచి పుష్కర ఘాట్ మూసివేశారు. నేటికి ఆలయం, పుష్కరఘాట్​లోకి పర్యటకులను పోలీసులు అనుమతించడం లేదు. 2009లో ఆలయం పూర్తిగా మునిగిపోయింది. మళ్లీ ఈరోజు గర్భగుడిలోకి నీరు చేరుకుంది.

గర్భగుడిలోకి సాగర్ నీరు
Last Updated : Aug 16, 2019, 6:44 AM IST

ABOUT THE AUTHOR

...view details