నల్లగొండ జిల్లా పెద్దవుర మండలంలో భాజపా అభ్యర్థి రవి నాయక్ ప్రచారం నిర్వహించారు. మండలంలోని పెద్దగూడెం, చిన్నగూడెం, చిర్శనగండ్ల, తమ్మడపల్లి, కొత్తబార్, బాసిరెడ్డిగూడెం, వెల్మగూడెం గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ఓటు అభ్యర్థించారు.
'అవకాశమివ్వండి... అభివృద్ధేమిటో చూపిస్తా' - సాగర్ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్తి రవి నాయక్ ప్రచారం
సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ సమయం సమీపిస్తున్నందున అభ్యర్థుల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. నల్గొండ జిల్లా పెద్దవుర మండలంలో భాజపా అభ్యర్థి ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు.
bjp canvassing, ravi nayak
గత ప్రభుత్వాలు నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని.. తనకో అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తా అన్నారు. కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:నాగార్జునసాగర్ ఉపపోరులో మహిళా ఓటర్లే కీలకం