తెలంగాణ

telangana

ETV Bharat / state

దుర్గం ఖిల్లాలో రూపుదిద్దుకోనున్న ఉద్యానం

రేచర్ల వంశీయులు, వెలమనాయుడులు ఏలిన చరిత్రాత్మక దేవరకొండ ఖిల్లాదుర్గం రూపుమారనుంది. కొండలు, రాళ్లతో నిండిన ఈ ప్రాంతం అందమైన పర్యాటక కేద్రంగా రూపుదిద్దుకుంటోంది. సుందరమైన ఉద్యానంగా తీర్చిదిద్దేందుకు సర్కారు పదికోట్ల నిధులను విడుదల చేసింది.

By

Published : Jul 7, 2019, 8:05 PM IST

దుర్గం ఖిల్లాలో రూపుదిద్దుకోనున్న ఉద్యానం

నల్గొండ జిల్లా దేవరకొండ ఖిల్లా దుర్గంకు మహర్ధశ పట్టనుంది. నాగార్జునసాగర్​, హైదరాబాద్​ రహదారి సమీపంలో దేవరకొండ పట్టణంలో ఉన్న ఈ దుర్గం వద్ద ఉద్యానం రూపుదిద్దుకోనుంది. ఐదెకరాల ప్రాంగణంలో పార్క్​ను నిర్మించేందుకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఇందులో చిల్డ్రన్​పార్క్​, జలపాతం, వాకింగ్​ట్రాక్​, క్యాంటీన్​, పౌంటేన్​, ఓపెన్​ జిమ్​ వంటి వసతులు సమకూరుస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రజల అభీష్టం నెరవేరనుంది

2012లో దేవరకొండ నగర పంచాయతీగా ఏర్పడిననాటి నుంచి పార్క్​కావాలంటూ స్థానికులు డిమాండ్​ చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే పురావస్తు శాఖ అనుమతి లభించడం వల్ల పార్కు నిర్మానానికి మార్గం సుగమమైంది. నిర్మాణం పూర్తయితే అటవీ శాఖ కార్యాలయం నుంచి నేరుగా బొడ్రాయి బజార్​ మీదుగా ఖిల్లాకు చేరుకోవచ్చు. దీనికి సంబంధించి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

దుర్గం ఖిల్లాలో రూపుదిద్దుకోనున్న ఉద్యానం

ఇదీ చూడండి: సందడిగా జాతీయ స్థాయి శరీర సౌష్ఠవ పోటీలు

ABOUT THE AUTHOR

...view details