నాగార్జునసాగర్‌కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. 8.35 లక్షల క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 5.32 లక్షలు క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. 26 క్రస్ట్ గేట్లు ఎత్తి 2.85 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం ప్రస్తుత నీటిమట్టం 572 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటిసామర్థ్యం 261.90 టీఎంసీలకు చేరింది. ప్రవాహం ఇలాగే కొనసాగితే.. రేపటి వరకు నీటిమట్టం గరిష్ఠ సామర్థ్యానికి చేరుకుంటుంది.
నాగార్జునసాగర్‌కు స్థిరంగా కొనసాగుతోన్న ప్రవాహం..
నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం సాగర్‌లో నీటిమట్టం 572 అడుగులుగా ఉంది.
కొనసాగుతోన్న ప్రవాహం..