తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగార్జునసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద

నాగార్జున సాగర్​కు వరద పెరగటంతో అధికారులు 8 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 33,495 క్యూసెక్కులు, ఏఎంఆర్పీకి 2,400 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు.

Nagarjuna sagar reservoir
నాగార్జునసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద

By

Published : Aug 11, 2021, 12:54 PM IST

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ జలాశయంకు మళ్లీ వరద పెరగటంతో 8 క్రస్ట్‌ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్‌కు ఎగువ నుంచి లక్షా 14 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా... వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువన ఉన్న పులిచింతల జలాశయంకు విడుదల చేస్తున్నారు.

జలాశయం మొత్తం నీటి నిల్వ 312.04 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 311.14 టీఎంసీలకు చేరటంతో 8 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి 64,552 క్యూసెక్కులను స్పిల్‌ వే ద్వారా దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ కుడి కాలువకు 6,112 క్యూసెక్కుల నీరు, ఎడమ కాలువకు 7,518 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 33,495 క్యూసెక్కులు, ఏఎంఆర్పీకి 2,400 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు.

ఇదీ చూడండి:'ఏటీఎంలలో నగదు లేకపోతే బ్యాంకులకు జరిమానా'

ABOUT THE AUTHOR

...view details