నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడలో కరోనా పాజిటివ్ వచ్చిన కుటుంబ సభ్యులకు తన సొంత ఖర్చులతో నిత్యావసర వస్తువులను సర్పంచ్ శోభా వెంకట్ రెడ్డి పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ... మాస్కులను తప్పకుండా వాడాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పా బయట తిరుగవద్దని హెచ్చరించారు.
నేరడ సర్పంచ్ దాతృత్వం.. కరోనా బాధితులకు నిత్యావసరాల పంపిణీ - nalgonda news
కరోనా పాజిటివ్ బాధితులకు నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామ సర్పంచ్ తన సొంత ఖర్చులతో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. గ్రామంలో కరోనా బాధితులకు అండగా నిలుస్తామని... వాళ్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని ధైర్యాన్నిచ్చారు.
nerada sarpanch distributed groceries to coorna patients
గ్రామంలో కరోనా బాధితులకు అండగా నిలుస్తామని... వాళ్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని ధైర్యాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వడ్డెగాని నర్సింహగౌడ్, స్థానిక నాయకులు సముద్రాల శంకర్‌గౌడ్, సీపీఎం నాయకులు కుమార స్వామి పాల్గొన్నారు.