వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో 9 నెలల పాపపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ నల్గొండ జిల్లా తేనెపల్లి సర్పంచి వడిత్య రజిత ముఖ్యమంత్రికి లేఖ రాశారు. నిందితుడు ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధించాలని పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లని వదిలేస్తే మరెంతో మంది చిన్నారులు, ఆడపడుచుల జీవితాలను నాశనం చేస్తారంటూ రజిత లేఖలో ప్రస్తావించారు. దేశం తలదించుకునేలా చేసిన ఇలాంటి వాళ్లకి కఠిన శిక్షలు అమలు చేయాలని కోరారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాల ఆపేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని సర్పంచి రజిత విజ్ఞప్తి చేశారు.
'ముఖ్యమంత్రికి మహిళా సర్పంచ్ లేఖ' - అత్యాచారం
'అయ్యా ముఖ్యమంత్రి గారు... అమ్మ ఒళ్లో బజ్జుంటూ... ఆడిపాడే 9 నెలల చిన్నారిని చిదిమేసిన నరరూపరాక్షసుడు ప్రవీణ్‌కు ఉరిశిక్ష వేయాలి. మరొకరిపై ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా చూడాలి' అంటూ నల్గొండ జిల్లా తేనెపల్లి సర్పంచి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.
'హత్యాచారం చేసిన ప్రవీణ్‌ను ఉరి తీయాలి'