తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉత్తమ్​ తీరు నచ్చకే పార్టీ వీడుతున్నా : చిరుమర్తి - congress

నకిరేకల్​ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే గులాబీ కండువా కప్పుకుంటున్నట్లు తెలిపారు. ఎవరి ప్రోద్బలంతో పార్టీ మారడంలేదని వెల్లడించారు.

తెరాసలో చేరుతునట్లు వెల్లడిస్తున్న లింగయ్య

By

Published : Mar 11, 2019, 3:49 PM IST

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి విధానాలు నచ్చకే పార్టీని వీడుతున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వెల్లడించారు. ఉత్తమ్​ తీరుతో గాంధీభవన్‌కు వచ్చే వారే కరవయ్యారని ఆరోపించారు. ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకిచ్చిన హామీలను నేరవేర్చాలనే తెరాసలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. కోమటి రెడ్డి సోదరులు రాజకీయంగా చాలా సహకరించినట్లు తెలిపారు. వాళ్లు పార్టీ మారుతారో లేదో తెలియదని లింగయ్య పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details