ఎగువ నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి 2 లక్షల 80 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 8 గేట్లను 6 అడుగుల మేరకు ఎత్తి 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తినీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం 589 అడుగుల వద్ద ఉంది. మొత్తం 312.04 టీఎంసీల సామర్ధ్యం ఉండగా... ప్రస్తుత సామర్ధ్యం 309.41 టీఎంసీలకు చేరుకుంది.
సాగర్‌కు పెరిగిన ఇన్‌ఫ్లో.. 8 గేట్లు ఎత్తిన అధికారులు
ఎగువ నుంచి వస్తున్న వరదకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ... నాగార్జునసాగర్ జలాశయానికి చేరుతోంది. 8 క్రస్ట్ గేట్లను మరొకసారి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
మరోసారి ఎత్తిన సాగర్ గేట్లు.. 60 వేల క్యూసెక్కుల నీటి విడుదల
జలాశయం నుంచి లక్ష 9 వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. వరద ఉద్ధృతి పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కృష్ణ నది దిగువ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవీ చూడండి:పోడు భూముల కోసం గిరిజనుల పోరు..
Last Updated : Aug 26, 2020, 10:43 PM IST