నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియా నూతన వంతెన వద్ద శిరసన గండ్ల రేవంత్ కుమార్(22) అనే పాల వ్యాపారిని గుర్తు తెలియనివ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో దాడిచేసి చంపారు. రేవంత్ కుమార్ రోజూ వివిధ గ్రామాల నుంచి పాలు సేకరించి హాలియాలో అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తుంటాడు.
హాలియాలో పాల వ్యాపారి దారుణ హత్య - నల్గొండ జిల్లా తాజా వార్త
ఓ పాల వ్యాపారిపై దుండగులు కత్తులతో, గొడ్డళ్లతో దాడిచేసి హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియా వద్ద చోటుచేసుకుంది.
హాలియాలో పాల వ్యాపారి దారుణ హత్య
రోజూ మాదిరిగానే పాల సేకరణ కోసం వెళ్తుండగా దారి కాచిన దుండగులు రేవంత్‌ను హత్య చేసి పారిపోయారు. హత్యకు ఆర్థిక లావాదేవీలు కారణమై ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలను సేకరింస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: కూలీల ట్రాక్టర్ బోల్తా... ఒకరు మృతి, 16 మందికి తీవ్రగాయాలు