పాదయాత్ర అనుమతికోసం డీజీపీకి ఎంపీ కోమటిరెడ్డి లేఖ - komatireddy
ఉదయ సముద్రం - బ్రాహ్మణవెల్లంల ఎత్తిపోతల పథకం సాధన కోసం చేపట్టే రైతు పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డీజీపీని కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి లేఖ అందజేశారు.
ఈ నెల 26 నుంచి 29 వరకు ఉదయ సముద్రం - బ్రాహ్మణవెల్లంల ఎత్తిపోతల పథకం సాధన కోసం చేపట్టే రైతు పాదయాత్రకు... అనుమతి ఇవ్వాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డీజీపీని కోరారు. ఈ మేరకు ఆయన డీజీపీ మహేందర్ రెడ్డికి లేఖ అందజేశారు. 2007 జూన్లో ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రూ.690 కోట్లు మంజూరైనా పనుల్లో జాప్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పాదయాత్ర చేయాలని నిర్ణయించామని అందుకు అనుమతి ఇవ్వాలని డీజీపీని కోరారు.