తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్రం కోసం జానారెడ్డి సీఎం పదవిని త్యాగం చేశారు'

నల్గొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తమ పార్టీని.. ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ హయాంలోనే నాగార్జునసాగర్​ అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు.

congress pressmeet,  peddavura,  mla seethakka
ఎమ్మెల్యే సీతక్క, పెద్దవూర, నాగార్జునసాగర్

By

Published : Apr 5, 2021, 4:13 PM IST

రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన నాయకుడు జానారెడ్డి అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ప్రజల ఆకాంక్షను గుర్తించిన కాంగ్రెస్.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని తెలిపారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించింది. మాజీ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు.

జానారెడ్డిని ఓడించాలని సాగర్ నియోజకవర్గంలోని ప్రతి గల్లీలో.. తెరాస తన ప్రతినిధులను దింపుతోందని సీతక్క ఆరోపించారు. నాగార్జునసాగర్​ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. జానారెడ్డిని బాల్క సుమన్ విమర్శించడం దారుణమన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందో అర్ధం చేసుకోవాలని ప్రజలను కోరారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో నేడు పలు ప్రాంతాల్లో వర్షాలు

ABOUT THE AUTHOR

...view details