నల్లగొండ జిల్లా వెల్మకన్నెలో అప్పుల బాధ తాళలేక ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ మహిళా రైతు కుటుంబాను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు. తనవంతు సాయంగా 5 లక్షల రూపాయలను బిమనపల్లి సునీత పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని, అప్పులు తీర్చేందుకు మూడున్నర లక్షల నగదు ఇస్తానని హామీ ఇచ్చారు.
మహిళా రైతు కుటుంబానికి రాజగోపాల్ రెడ్డి పరామర్శ
ఇటీవల అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన మహిళా రైతు కుటుంబాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు. తనవంతు సాయంగా 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్, అప్పులు తీర్చేందుకు మూడున్నర లక్షల నగదు ఇస్తానని హామీ ఇచ్చారు.
సునీత, నర్సింహ దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి నలుగురు సంతానం. ఆరేళ్ల క్రితం భర్త నర్సింహ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి తమకున్న మూడెకరాలతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని పంట పండిస్తూ నలుగురు పిల్లలను పోషిస్తోంది. రెండేళ్లుగా కాలం కలిసిరాక వేసిన పంటలు అలాగే పోయాయి. సునీతకు అప్పుల బాధలు ఎక్కువయ్యాయి. ఎలా తీర్చాలో తెలియక జూన్ 28న ఆత్మహత్యకు పాల్పడింది. ఈటీవీ భారత్లో వచ్చిన కథనాలకు స్పందించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడు సునీత కుటుంబాన్ని పరామర్శించాడు.
ఇవీ చూడండి: సిద్దిపేటకు సురేందర్ గర్వకారణం.. హరీష్రావు పొగడ్తల వర్షం