తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రతిఇంట్లో ఆరు మొక్కలు నాటాలి.. ప్రతిమొక్కనూ సంరక్షించాలి' - 6th phase haritha haaram

నల్గొండలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​ రెడ్డి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతీ ఇంటికి ఆరు చొప్పున మొక్కలు నాటటమే కాకుండా... వాటిని సంరక్షించాలని కోరారు.

mla bhupalreddy started haritha haram program in nalgonda
'ఇంటికి ఆరు చొప్పున మొక్కలు నాటి, సంరక్షించాలి'

By

Published : Jun 25, 2020, 5:10 PM IST

ప్రతీ పల్లె, పట్టణం హరితవనాన్ని తలపించాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​రెడ్డి సూచించారు. నల్గొండలోని 7, 8 వార్డుల్లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు.

కనగల్, తిప్పర్తిలో జడ్పీటీసీ పాశం రాంరెడ్డి మొక్కలను నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ప్రతీ ఇంట్లో ఆరు మొక్కల చొప్పున నాటి... సంరక్షించుకోవాలని ప్రజలను కోరారు.

ఇవీ చూడండి:రాష్ట్రానికి కేంద్రం జీఎస్టీ నష్ట పరిహారం చెల్లించేనా?

ABOUT THE AUTHOR

...view details