రాష్ట్రంలో వృత్తిదారుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను వినియోగించుకుని, ఆర్థికంగా ఎదగాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. నల్గొండలో జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో తలసానితో పాటు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణలో కులవృత్తులకు పూర్వ వైభవం: మంత్రి తలసాని - గొర్రెల పంపిణీపై తలసాని శ్రీనివాస్ యాదవ్
రాష్ట్రంలో కుల వృత్తులు పూర్వ వైభవం సంతరించుకున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గొల్లకుర్మలు ఆత్మాభిమానంతో జీవించడానికి గొర్రెల పంపిణీ ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. తొలి విడతలో పెండింగ్‌లో ఉన్న గొర్రెల యూనిట్ పథకాన్ని... నల్గొండలో మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి తలసాని ప్రారంభించారు.
minister talasani srinivas yadav
కులవృత్తిని ప్రోత్సహించేందుకు దేశంలో ఎక్కడా లేని వినూత్న పథకానికి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు తలసాని తెలిపారు. గొల్లకురుమల్లో అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం వర్తించేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ పథకం... గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్ఠం చేసిందని జగదీశ్ రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి :'వ్యాక్సినేషన్ విజయవంతం... సీఎం కృషి అభినందనీయం'