Ktr Nalgonda tour: ఐదేళ్లు కరవు వచ్చినా హైదరాబాద్‌కు తాగునీటికి ఇబ్బంది ఉండదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల ఇన్‌టెక్ వెల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఎంత విస్తరించినా రాబోయే 50 ఏళ్లకు నీటికొరత రాకుండా ఉపయోగపడుతుందని చెప్పారు. ఓఆర్ఆర్ చుట్టూ 159 కిలోమీటర్లు రింగ్ మెయిన్ వేయాలనుకుంటున్నామన్న కేటీఆర్ 2072 వరకు ఇబ్బంది లేకుండా ప్రాజెక్టులు చేపట్టామని కేటీఆర్ స్పష్టం చేశారు.
అనంతరం నాగార్జునసాగర్‌లో అంతర్జాతీయ హంగులతో ముస్తాబైన బుద్ధవనాన్ని మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. 274 ఎకరాల్లో దాదాపు 100 కోట్లు ఖర్చుచేసి సుందరంగా తీర్చిదిద్దినట్లు వివరించారు. గౌతముడు నడయాడిన బుద్ధగయ, సారనాథ్, లుంబిని తదితర ప్రాంతాల్లో లేని విధంగా అన్ని ప్రతిమలను ఈ పార్కులో నెలకొల్పడం విశేషమని కొనియాడారు.