తెలంగాణ

telangana

ETV Bharat / state

మునుగోడు ఉపఎన్నికలో భాజపాకు సరైన జవాబిస్తాం: జగదీశ్​రెడ్డి

Jagadish Reddy fire on bjp: విభజన రాజకీయాలతో దేశంలో మధ్యయుగం నాటి పరిస్థితులను తీసుకొచ్చేందుకు భాజపా ప్రయత్నిస్తున్నట్లు మంత్రి జగదీశ్​రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పిన ఆయన.. మునుగోడులో వామపక్ష పార్టీలతో జతకట్టి పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు.

Minister Jagadish Reddy
Minister Jagadish Reddy

By

Published : Oct 6, 2022, 6:38 PM IST

"విభజన రాజకీయాలతో దేశంలో మధ్యయుగం నాటి పరిస్థితులు తీసుకొస్తున్నారు"

Jagadish Reddy fire on bjp: విభజన రాజకీయాలతో దేశంలో మధ్యయుగం నాటి పరిస్థితులను తీసుకొచ్చేందుకు భాజపా ప్రయత్నిస్తున్నట్లు మంత్రి జగదీశ్​రెడ్డి అన్నారు. భాజపా ఆగడాలను అడ్డుకునేందుకు ప్రగతిశీల శక్తులతో కలిసి సాగుతున్నట్లు ఆయన తెలిపారు. మునుగోడు ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన అన్నారు.

ఇందులో భాగంగా వామపక్షాలతో జతకట్టి, ప్రత్యర్థులను చిత్తుచేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈరోజు నల్గొండలో తెరాసతో పాటు సీపీఎం, సీపీఐ నేతలు చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి సహా.. పలువురు నాయకులతో సమావేశం నిర్వహించిన జగదీశ్​రెడ్డి.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు భాజపా కుయుక్తులు పన్నుతోందని ధ్వజమెత్తారు. భాజపాకి మునుగోడు ఉపఎన్నికల్లోనే ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.

"విభజన రాజకీయాలతో దేశంలో మధ్యయుగం నాటి పరిస్థితులను తీసుకొచ్చేందుకు భాజపా ప్రయత్నిస్తుంది. భాజపా ఆగడాలను అడ్డుకునేందుకు ప్రగతిశీల శక్తులతో తెరాస నడుస్తోంది. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు భాజపా కుయుక్తులు పన్నుతోంది. భాజపాకి మునుగోడు ఉపఎన్నికల్లోనే ప్రజలు బుద్ధి చెప్పాలి". - మంత్రి జగదీశ్​ రెడ్డి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details