కరోనాకు భయపడవలసిన అవసరం లేదన్నారు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన గుత్తా... మనోధైర్యంతో కరోనాను జయించాలని సూచించారు. తమ ఇంట్లో ఆరుగురికి వైరస్ సోకినా... భయపడకుండా ఇంట్లో ఉండి నయం చేసుకున్నట్లు తెలిపారు.
మా ఇంట్లో ఆరుగురికి కరోనా సోకింది: మండలి ఛైర్మన్ గుత్తా - గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం
తమ ఇంట్లో ఆరుగురికి వైరస్ సోకినా... భయపడకుండా ఇంట్లోనే ఉండి నయం చేసుకున్నట్లు తెలిపారు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.
మా ఇంట్లో ఆరుగురికి కరోనా సోకింది: గుత్తా
ఉస్మానియా ఆసుపత్రి విషయంలో ప్రతిపక్షాలు రెండు నాలుకల ధోరణితో మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేయడం అద్భుతమని కొనియాడారు. అన్ని ఏరియా ఆసుపత్రులు, పీహెచ్ సీ కేంద్రాల్లో ర్యాపిడ్ కిట్ల ద్వారా సర్కారు వైద్యం అందిస్తోందన్నారు. కరోనాతో సహజీవనం తప్పదని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.