ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 1,32,187 క్వింటాళ్ల ధాన్యాన్ని మార్క్‌ఫెడ్, ఎఫ్‌సీఐ ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. వాటికి సంబంధించి రూ. 39.02 కోట్లు రైతులకు చెల్లించగా ఇంకా రూ.38.06 కోట్లు చెల్లించాల్సి ఉంది. లాక్‌డౌన్ సమయంలో ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులు సత్వరమే జరుగుతున్నా కంది రైతులకు మాత్రం బకాయిలు ఇంకా అందకపోవటం గమనార్హం.
పెట్టుబడులకు ఇక్కట్లు
మరో రెండు, మూడు వారాల్లో వానాకాలం పంటల పనులు మొదలవుతాయి. దుక్కులు దున్నడం, విత్తనాలు సమకూర్చుకోవడం, కూలీలకు చెల్లింపులు జరిపేందుకు డబ్బులు అవసరమవుతాయి. ప్రభుత్వం కందులకు సంబంధించిన నగదును చెల్లిస్తే అప్పులు పోగా మిగిలిన నగదును పెట్టుబడులకు వినియోగించుకునేందుకు దోహదపడుతుందని రైతులు యోచిస్తున్నారు.