కేసీఆర్ డిక్టేటర్‌గా మారారు: జితేందర్ రెడ్డి - bjp
తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ డిక్టేటర్‌గా మారి పాలిస్తున్నాడని మాజీ ఎంపీ, భాజపా నేత జితేందర్ రెడ్డి ఆరోపించారు. నల్గొండలో ఇంటర్‌బోర్డు తప్పిదాల వల్ల చనిపోయిన విద్యార్థులకు నివాళులు అర్పించారు.
నివాళులు అర్పుస్తున్న జితేందర్ రెడ్డి
మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ, భాజపా నేత జితేందర్ రెడ్డి నల్గొండలో పర్యటించారు. స్థానిక భాజపా కార్యాలయంలో ఇంటర్ బోర్డ్ తప్పిదాల వల్ల చనిపోయిన విద్యార్థులకు నివాళులు అర్పించారు. సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు నుకాల నర్సింహారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.