తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓట్లడిగే హక్కు కాంగ్రెస్​కు లేదు: జగదీశ్వర్​ రెడ్డి - trs

అరవై ఏళ్లు పాలించిన కాంగ్రెస్​ తెలంగాణకు చేసిందేమీ లేదని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్​ రెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో రోడ్​ షోలో పాల్గొన్నారు.

జగదీశ్వర్​ రెడ్డి, సుఖేందర్​ రెడ్డి

By

Published : Apr 4, 2019, 5:38 PM IST

ఓట్లడిగే హక్కు కాంగ్రెస్​కు లేదు: జగదీశ్వర్​ రెడ్డి
దేశంలో ఉన్న పేదకరికాన్ని నిర్మూలించడానికి కేసీఆర్​ను దేశ రాజకీయాలకు పంపించాల్సిన అవసరం ఉందన్నారు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్​ రెడ్డి. నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో జరిగిన రోడ్​ షోకు హాజరయ్యారు. 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని...ఓట్లు అడిగే హక్కు ఆ పార్టీకి లేదన్నారు.

ప్రాంతీయ పార్టీలే కీలకం

త్వరలో జరగనున్న లోక్​సభ ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైనవని మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్​ రెడ్డి అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో ప్రాంతీయ పార్టీల ఆవశ్యకత చాలా ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు.

ఇవీ చూడండి:'భార్యాబాధితుల గోడు సభలో వినిపిస్తా'

ABOUT THE AUTHOR

...view details