తెలంగాణ

telangana

By

Published : Apr 7, 2021, 3:14 PM IST

Updated : Apr 7, 2021, 4:00 PM IST

ETV Bharat / state

ఆరు నెలలపాటు అనాథాశ్రమానికి వెళ్లి సేవ చేయండి: హైకోర్టు

high court on nalgonda collector
collector patel, nalgonda collector

15:11 April 07

సామాజిక సేవ చేయాలని నల్గొండ కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం

  కోర్టు ధిక్కరణ కేసులో భాగంగా... సామాజిక సేవ చేయాలని నల్గొండ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనాథాశ్రమంలో వారానికి 2 గంటలు గడపాలన్న కోర్టు...6 నెలలపాటు అనాథాశ్రమానికి వెళ్లి సేవ చేయాలని తెలిపింది. ఉగాది, శ్రీరామనవమి రోజుల్లో అనాథాశ్రమంలో భోజనాలు పెట్టాలని... విశ్రాంత పౌరసరఫరాల జిల్లా అధికారి సంధ్యారాణిని హైకోర్టు ఆదేశించింది.

  గతంలో కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరికి 2వేల జరిమానా విధించిన సింగిల్ జడ్జి ఉత్తర్వులు కొట్టేయాలంటూ హైకోర్టు ధర్మాసనానికి అధికారులు అప్పీల్‌ చేశారు. ఆ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం.. సామాజిక సేవ చేయాలని ఆదేశిస్తూ విచారణను ముగించింది.

ఇదీ చూడండి:వామన్​రావు హత్య కేసులో పోలీసుల నివేదికపై హైకోర్టు సంతృప్తి

Last Updated : Apr 7, 2021, 4:00 PM IST

ABOUT THE AUTHOR

...view details