విజయవాడ-హైదరాబాద్ రహదారిపై లారీ బోల్తా.. 4 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్ - నల్గొండ జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
09:00 November 27
విజయవాడ-హైదరాబాద్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Hyderabad vijayawada traffic jam: విజయవాడ-హైదరాబాద్ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద లారీ బోల్తా పడింది. డివైడర్‌ను ఢీకొని రహదారి మధ్యలో లారీ పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్- విజయవాడ మార్గంలో 4కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఫలితంగా ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించారు.
ఇదీ చదవండి:Holidays in 2022: తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవులివే!