ఎడతెరిపిలోని వర్షాలతో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఆది సోమవారాల్లో కలిపి 10.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలంలోని రుద్రారం చెరువు అలుగుపోస్తోంది. వేములపల్లి మండలం శెట్టి పాలెం వద్ద చిత్రపరక వాగు రోడ్డుపై ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటితో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎడతెరిపిలేని వర్షం... అలుగు పోస్తున్న చెరువులు
మిర్యాలగూడ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండు కుండలా మారాయి. మిర్యాలగూడలో ఆదివారం 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సోమవారం 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఎడతెరిపిలేని వర్షం... అలుగు పోస్తున్న చెరువులు