నల్గొండ జిల్లా దేవరకొండ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగులు, వంకలు నీటితో పరుగులు పెట్టాయి. దేవరకొండ మండలంలోని పలు చెరువులకు వరద నీరు చేరుతోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో చాలా రోజులుగా వట్టిపోయి ఉన్న తాటికోల్, ముదిగొండ, మైనంపల్లి వాగులు ఈ వానతో పరుగులు పెట్టాయి. చాలా కాలం తర్వాత కురిసిన వర్షానికి రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున వరద నీటిని గమనించక ముదిగొండవాగులోకి వెళ్లిన సాలమ్మ అనే మతిస్తిమితం లేని వృద్ధ మహిళ మరణించింది.
దేవరకొండలో భారీ వర్షం - rain
గత కొద్ది రోజులు వానలు లేక ఎండపోతున్న పంటలకు జీవం వచ్చింది. నల్గొండ జిల్లా దేవరకొండలో కురిసిన భారీ వర్షంతో వాగులు పొంగిపోర్లాయి. వాగులోకి వెళ్లిన మతిస్తిమితం లేని వృద్ధ మహిళా నీటిలో మునిగి చనిపోయింది.
పారుతున్న వాగు