నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో సుమారు కోటి రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాస్కరరావు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయడం ప్రభుత్వం ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరించిందన్నారు.