governor tamilisai: గ్రామీణ విద్యార్థులకు, గిరిజన విద్యార్థులకు ఉద్యానవన పంటలపై శిక్షణ ఇచ్చి.. వారిని స్వయం ఉపాధి దిశగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని గవర్నర్ తమిళిసై సూచించారు. నల్గొండ జిల్లా మర్రిగూడెం మండల కేంద్రంలో ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలను గవర్నర్ ప్రారంభించారు. కళాశాల స్థాపించిన ఎన్జీవో సంస్థ గ్రామభారతికి గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు.
governor tamilisai: విద్యార్థులను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించాలి: తమిళిసై
governor tamilisai: ఉద్యానవన పంటల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని గవర్నర్ తమిళిసై అన్నారు. నల్గొండ జిల్లాలోని మర్రిగూడెం మండలకేంద్రంలో హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను ఆమె ప్రారంభించారు.
నల్గొండ జిల్లాలోని మర్రిగూడెం మండలకేంద్రంలో గవర్నర్
ఉద్యానవన పంటల సాగు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని గవర్నర్ తెలిపారు. బ్యాంకులు కూడా పుష్కలంగా రుణాలను అందిస్తున్నాయని ఆమె వివరించారు. అవకాశాలను అందిపుచ్చుకుని విద్యార్థులు హార్టికల్చర్ సాగులో కొత్త కొత్త ప్రయోగాలు చేసి రైతులకు అండగా నిలవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరిత హారం పథకంతో గ్రీనరీ బాగా పెరుగుతోందని గవర్నర్ తమిళిసై అన్నారు.
ఇదీ చూడండి: