తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళల స్వయం ఉపాధి ధ్యేయంగా- 30 సంవత్సరాలుగా ఉచిత శిక్షణ

Free Vocational training for Women in Nalgonda : మహిళలు స్వయం ఉపాధి పొందాలనేది భగవాన్‌ శ్రీ సత్యసాయి సేవా సమితి సంస్థ లక్ష్యం. వందలాది మంది అతివలకు వృత్తి పనుల్లో శిక్షణ ఇచ్చి నిపుణులుగా తీర్చిదిద్దుతోంది. గ్రామీణ స్త్రీల జీవితాల్లో వెలుగు నింపుతోంది.

Womens free Training in vocational education at Nalgonda
Sathya Sai Seva Samithi Free Training in Nalgonda

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2023, 12:48 PM IST

మహిళల స్వయం ఉపాధి ధ్యేయంగా 30 సంవత్సరాలుగా ఉచిత శిక్షణ

Free Vocational training for Women in Nalgonda :నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన భగవాన్‌ శ్రీ సత్యసాయి సేవా సమితి గ్రామీణ మహిళలు, యువతుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. వృతి విద్య కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తోంది. ఐదేళ్లుగా 500 మందికి కుట్లు, మగ్గం, అల్లికలు వంటి వాటిలో తర్ఫీదునిచ్చింది. శిక్షణ పూర్తి చేసుకున్న అతివలకు ధ్రువపత్రాలు అందిస్తోంది. బ్యాంకు నుంచి రుణాలు వచ్చేలా చొరవ తీసుకుని మహిళల జీవితాల్లో ఆర్ధిక సాధికారత నింపుతోంది. భగవాన్‌ శ్రీ సత్యసాయి సేవా సమితిలో శిక్షణ పొందినవారిలో కొందరు సొంతంగా వ్యాపారాలు చేస్తుంటే మరికొందరు ఇతర సంస్థల్లో ఉపాధి పొందుతున్నారు.

"స్వయం ఉపాధి పొందేందుకు ఈ శిక్షణా సంస్థకు వచ్చాం. నేను మగ్గాం, మిషన్, బ్యుటీషియన్​ కోర్సు నేర్చుకోడానికి వచ్చాను. వేరే ప్రాంతానికి వెళ్లి నేర్చుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతోంది. ఇక్కడ మాకు దగ్గర. మందిరంలో ఎక్కువ మంది ఉన్నందున మాకు ఆహ్లాదంగా ఉంటుంది. మేము కోర్సు పూర్తి చేసిన తరావాత సర్టిఫికెట్స్​ కూడా ఇస్తున్నారు. మా సొంతంగా షాపు పెట్టి డబ్బులు సంపాదించుకోగలుగుతున్నాను."- సంధ్య, బ్యూటీషియన్‌ శిక్షకురాలు

fees Increase: వృత్తి విద్యలో ఫీజుల పెంపు.. గరిష్ఠంగా ఎంతంటే..?

Women Free Training atSathya Sai Seva Samithi :సత్యసాయి సేవా సమితిలో ప్రస్తుతం బ్యూటీషియన్‌ కోర్సులో 80 మంది శిక్షణ పొందుతున్నారు. ప్రముఖ సంస్థలకు తీసిపోని విధంగా శిక్షణ అందిస్తున్నామని నిర్వహకురాలు సంధ్య తెలిపారు. మెహందీ, బ్లీచ్‌, ఐబ్రోస్‌, మ్యానీక్యూర్‌, పెడిక్యూర్‌, ఫేషియల్‌ వంటివి నేర్పిస్తున్నారు. బయట సంస్థల్లో శిక్షణ తీసుకోవాలంటే రూ.70 వేల నుంచి లక్షకుపైగానే ఖర్చువుతుందని తాము ఉచితంగా నేర్పించడం(Free Training For Womens)తో పాటు ధ్రువీకరణ పత్రం కూడా ఇస్తామని సంధ్య తెలిపారు.

సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సామూహిక వివాహం

"మేము గత 30 సంవత్సరాల నుంచి సత్యసాయి సేవా సమితి ద్యారా ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నాం. సుమారుగా 5 సంవత్సరాలుగా మరింత వేగంగా బ్యాచ్​లను తయారు చేస్తున్నాం. మేము అనుకున్న విధంగానే చాలా మందికి ఇది ఉపయోగపడుతోంది. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. భక్తులందరం డబ్బులు సమకూర్చుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం."-ఆదినారాయణ, శ్రీ సత్యసాయి సేవాసమితి కన్వీనర్

Women free Training in vocational education atNalgonda :సత్యసాయి సేవా సమితి(Sathya Sai Seva Samithi in Nalgonda) ఆధ్వర్యంలో 30 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామ కన్వీనర్ ఆదినారాయణ చెప్పారు. మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థికాభివృద్ధి సాధించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఉచిత శిక్షణ ఇచ్చి తమ జీవితాలకు దారి చూపిస్తున్న సత్యసాయి సేవాసమితి సంస్థకు మహిళలు కృతజ్ఞతలు చెబుతున్నారు.

సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ

సత్యసాయి సేవా సమితి 'అమృత కలశం' పంపిణీ

ABOUT THE AUTHOR

...view details