నల్గొండ జిల్లా డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న చర్లగూడెం, కిష్టారాయిన్ పల్లి ప్రాజెక్టు పరిధిలో ఉన్న ముంపు గ్రామాల రైతులు ఆందోళన బాట పట్టారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాలకు ఇచ్చినటువంటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. ఎకరాకు 11లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. ప్రాజెక్టు పనులకు అంతరాయం కలిగిస్తున్న వారిని పోలీసు అధికారులు అడ్డుచెప్పి వారిని వారించారు.
డిండి ముంపు గ్రామాల రైతుల ఆందోళన - formers
డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా భూనిర్వాసితులకు మల్లన్నసాగర్ బాధితులకు ఇచ్చినటువంటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎకరాకు 11లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని కోరారు.
రైతును అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు